- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
potholed road : రోడ్డు ఇలాగైతే ఊరికి వెళ్ళేదెలా..
దిశ, వెల్గటూర్ : సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ గ్రామంలో హడావిడిగా ఓ శిలాఫలకాన్ని వేసి ఎన్నికల అనంతరం రోడ్డు వేయడం మరిచారని ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ గ్రామానికి వెళ్లే రోడ్డును పరిశీలిస్తే 80వ దశకంలో తెలంగాణ పల్లెల్లోకి వెళ్లే రోడ్ల పై ఆనాటి ప్రజలు పడుతున్న బాధలు గుర్తుకు వస్తాయి. ఆ ఊరికి వెళ్లే ప్రధాన రోడ్డు ఇలా ఉంటే లోపలికి వెళ్లేదెలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెల్గటూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి వెళ్లాలంటే ఎవరికైనా ఎంతో ఓపిక ఉండి భగీరథ ప్రయత్నం చేయాల్సిందే సుమా... గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్డంతా బురుదమయం అయింది. రోడ్డు పై ఏర్పడిన మోకాలు లోతు గుంతలు ప్రజల ప్రయాణానికి తీవ్ర ఆటంకాన్ని కల్గిస్తున్నాయి. ద్విచక్ర వాహనాల పై ఎవరైనా ధైర్యం చేసి ప్రయాణం చేస్తే తప్పకుండా గుంతల్లో పడి కాలో, చెయ్యో విరగటం మాత్రం ఖాయమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల ప్రధాన రహదారి నుంచి గ్రామంలోని పాఠశాల వరకు ఈ మట్టి రోడ్డు సుమారు కిలోమీటరు పొడవు ఉంటుంది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అప్పటి నాయకులు రోడ్డును అభివృద్ధి చేస్తామని హామీఇచ్చి మరిచారు. అదేవిధంగా మంత్రి పదవిలో ఉన్న కొప్పుల ఈశ్వర్ సార్వత్రిక ఎన్నికలను ముందు హడావిడిగా అక్టోబర్ 8-2023 లో గ్రామంలో రూ. 1.4 కోట్ల సీఆర్ఆర్ నిధులతో త్వరలో ఈ రోడ్డును అభివృద్ధి చేయనున్నట్లు శిలాఫలకం వేసి శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ రోడ్డుతో ఇబ్బంది పడుతున్న ప్రజలు మంత్రి చిత్రపటానికి మరునాడే గ్రామంలో క్షీరాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే వారి ఆనందం మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలింది. ఎన్నికలు పూర్తయ్యాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ కూలిపోయింది. కొప్పుల ఈశ్వర్ ఓడి పోయారు. ఎప్పటిలాగే ఈ రోడ్డు బాధలు వెంకటాపూర్ వాసులకు తప్పలేదు. ఈ మట్టి రోడ్డు పై మా బాధలను తీర్చే నాధుడే లేదా అంటూ వెంకటాపూర్ వాసులు వేడుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఇటువైపు ఓ కన్ను వేసి మట్టి రోడ్డు పై మేం పడుతున్న బాధలను తీర్చాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు .