తుగ్లక్ పాలనలో నలిగిపోతున్న నిరుపేదలు: బీజేపీ నాయకులు వివేక్ వెంకటస్వామి

by Shiva |
తుగ్లక్ పాలనలో నలిగిపోతున్న నిరుపేదలు: బీజేపీ నాయకులు వివేక్ వెంకటస్వామి
X

దిశ, సుల్తానాబాద్: సీఎం కేసీఆర్ తుగ్లక్ పాలనలో నిరుపేదలు నలిగిపోతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. సుల్తానాబాద్ లో పెట్రోలు, గ్యాస్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ ఆదివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ తో సీఎం అనుచర వర్గం భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లాలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ రూ.కోట్లు దోచుకుంటున్నారని తెలిపారు.

అదేవిధంగా పంచిన బస్సు చార్జీలు, మద్యం రేట్లు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ పరిణామం పెనుభారంగా పరిణమించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏగోలపు సదయ్యగౌడ్, నాయకులు గొట్టుముక్కల సురేష్ రెడ్డి, సజ్జద్, అడ్డగుంట శ్రీనివాస్ గౌడ్, బాలసాని సతీష్, గుండేటి ఐలయ్య యాదవ్, గజభీంకర్ పవన్, కూకట్ల నాగరాజు, అల్లం సతీష్, ఆరెపల్లి రాహుల్, సతీష్, బుర్ర సతీష్, రావుల రాజకుమార్, కారెంగుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed