- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫైల్ కదలాలంటే పైసలు కట్టాల్సిందే.. ఆ లబ్దిదారుల వద్ద నిలువు దోపిడి..!
దిశ ప్రతినిధి, కరీంనగర్: దళిత బంధు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో అవినీతికి పాల్పడుతున్నారంటూ పలువురు ఆందోళన చేశారు. దళిత నాయకులే ఈ వ్యవహారానికి పాల్పడుతుండడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా మండల పరిషత్ కార్యాలయం ముందే ఆందోళన చేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం కల్గించింది. దళిత బంధు లబ్దిదారుల ఎంపిక విషయంలో తీరని అన్యాయానికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీపీ భర్త లబ్దిదారులుగా ఎంపిక కావాలంటే డబ్బులు ముట్టచెప్పాల్సిందేనంటున్నాడని దళితులు ఆరోపించారు. రూ. 50 వేలు ఇస్తేనే ఫైలు మంజూరు కోసం వెల్తుందని స్పష్టం చేస్తున్నాడని ఆరోపించారు. మండలం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న జెడ్పీటీసీ, ఎంపీపీలు ఇద్దరు కూడా దళితులే అయినా తమకు అన్యాయం జరుగుతుండడం బాధాకరమన్నారు. అనంతరం స్థానిక ఎంపీడీఓను కలిసిన వారు లంచం ఇవ్వాలని అడుగుతున్నాడని, ఏ అధికారం లేని ఎంపీపీ భర్తకు ఆఫీసులో కూర్చోనే అధికారం ఎక్కడిదంటూ ప్రశ్నించారు. ఆయన ఇచ్చిన ఫైళ్లు మాత్రమే క్లియరెన్స్ అవుతాయని చెప్పుకుంటున్నాడని వివరించారు.