ఈ మందులు మా కొద్దు..!

by Sumithra |
ఈ మందులు మా కొద్దు..!
X

దిశ, సైదాపూర్ : పేద ప్రజల కోసం ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తున్న మందులు అధికారుల అనాలోచిత నిర్ణయాలు, సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే గడువు తీరిపోతున్నాయి. మరికొన్ని చోట్ల ఎలుకల పాలు కాగా, కొన్నిచోట్ల సరైన భద్రత లేక తడిసి ఫంగస్ వచ్చి పాడైపోతున్నాయి. విలువైన ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరైతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ తరహాలోనే నాలుగు నెలల్లో గడువు తీరనున్న మందులను తాము తీసుకుపోమని ఆశావర్కర్లు తిరస్కరించిన ఘటన సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే మంగళవారం ఆసుపత్రిలో ఆశావర్కర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఫార్మాసిస్టు సురేష్ కల్యాణ్ 40 కాటన్ల మందుల గోళీలు కల్గిన కాటన్లను పీహెచ్సీ పరిధిలోని 10 సబ్ సెంటర్లకు తీసుకుపోవాలని ఆశావర్కర్లకు ఆదేశించారు.

అందుకు వారు ససేమిరా ఒప్పుకోలేదు. వారు వాటిని ఆసుపత్రి ఆవరణలోనే వదిలేసి వెళ్ళారు. ఫిబ్రవరి 2025 తో గడువు ముగుయనున్న గ్లిమిపిరైడ్ 1 మిల్లి గ్రామ్, కాల్షియం కార్బోనేట్, విటమిన్ డి-3 ట్యాబ్లేట్లు మార్చి 2025 తో గడువు ముగియనున్నది. ఇవి ఒక్కో కాటన్ లో 20 వేల ట్యాబ్లెట్లు ఉంటాయి. ఐతే ఇవి కేవలం కొద్దికాలంలోనే ప్రజలకు అంటగట్టాలంటే చాలా రిస్క్ తో కూడుకున్నదని.. క్షేత్రస్తాయి సిబ్బంది తెలిపారు. డయాబెటిక్ పేషెంట్లకు ఇచ్చే గ్లిమిపిరైడ్ 1 మిల్లి గ్రామ్, ఒక్కో సెంటర్ కు 20 వేల ట్యాబ్లెట్లను ప్రజలకు ఎలా అంటగట్టాలని వాపోయారు. పదుల సంఖ్యలోనే షుగర్ పేషెంట్లు ఉంటారని.. తక్కువ సమయంలో పంపిణీ సాధ్యం కాదని అంటున్నారు. మిగులు మందుగోళీలను వృధాగా మిగిలిపోతున్నాయని.. వాటితో పాటు మరి కొన్నింటికి గడువు సమీపిస్తున్నా వాటిని కావాలనే అంటగట్టారని క్షేత్ర స్థాయి వైద్య సిబ్బంది అంటున్నారు. గడువు తీరిపోయిన మందులను పారవేయడం గగనమౌతున్నదని ఆరోపిస్తున్నారు.

గడువు దగ్గర ఉన్నా తీసుకుపోవాల్సిందే.. డాక్టర్ కృష్ణా కుమార్, వైద్యాధికారి

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఔషద గిడ్డంగి నుంచి మధ్యాహ్నం వ్యాన్ వచ్చింది. పెద్ద మొత్తంలో మందు కాటన్లు దిగుమతి చేసి వెళ్లి పోయారన్నారు.. నాలుగు నెలల వ్యవధిలో గడువు తీరనున్న మందులను గ్లిమిపిరైడ్ 1 మిల్లి.గ్రామ్ మందుకాటన్లు, కాల్షియం కార్బోనేట్ , విటమిన్ డీ-3 ట్యాబ్లెట్స్ మార్చి 2025 తో గడువు ముగియనున్నట్లు పరిశీలించానని తెలిపారు. గడువు దగ్గరున్నా ఏఎన్ఎంలు వారి సబ్ సెంటర్లకు తీసుకుపోవాల్సిందేనని తెలిపారు. అయినప్పటికీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు పోయి చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story