- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సర్పంచ్ భర్త తీరు... సెల్ ఫోన్ టవర్ ఎక్కిన యువకుడు
దిశ, ముస్తాబాద్: మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సుమతి తన భర్త పేరు మీద నిబంధనలు తుంగలో తొక్కి సెట్ బ్యాక్ లేకుండా 9వ వార్డ్ లో ఇంటి నిర్మాణం చేపడుతుందని, ఆ అక్రమ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని కాలనీవాసుడు, బీజేపీ నేత జిల్లెళ్ల ఉపేందర్ రత్నాలకుంట వద్ద ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉపేందర్ ను టవర్ దించేంలని ప్రయత్నించినప్పటికీ అతడు టవర్ దిగడానికి ససేమిరా అనడంతో చేసేదేమీ లేక చోద్యం చూశారు. సర్పంచ్ ఇష్టానుసారంగా ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నాడని, ఆయన ఎలాంటి నిబంధనలు పాటించడం లేదంటూ ఇందుకు సహకరించిన ఈవో రాజు ను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించారు.
ధర్నా ఉధృతంగా సాగిన నేపథ్యంలో స్థానిక ఎస్సై అందుబాటులో లేకపోవడంతో తంగళ్లపెళ్లి ఎస్సై లక్ష్మారెడ్డి రంగంలోకి దిగి ధర్నా ను చెదరగొట్టి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చేశారు. ధర్నాలో పాల్గొన్న వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సెల్ ఫోన్ టవర్ ఎక్కిన ఉపేందర్ ఎంతకీ కిందకి దిగకపోవడంతో, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఉపేందర్ సెల్ ఫోన్ టవర్ దిగడంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.