గీతకార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

by Sridhar Babu |
గీతకార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
X

దిశ, తిమ్మాపూర్ : గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో గీత కార్మికులకు సేఫ్టీ మోకులను పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గీతకార్మికులకు కాటమయ్య రక్షణ కవచం పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలో కూడా ప్రతి గీతకార్మికునికి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రక్షణ కవచాలు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతి గీత కార్మికుడు చెట్టు ఎక్కే ముందు తప్పకుండా కాటమయ్య రక్షణ కవచం ధరించాలని కోరారు. ఈ రక్షణ కవచం వాడటం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, తిమ్మాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, శ్రీనివాసరావు, ఆబ్కారీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed