Peddapalli Collector : గ్రామీణ ఓటరు జాబితా రూపకల్పనలో సహకరించాలి.

by Aamani |
Peddapalli Collector : గ్రామీణ ఓటరు జాబితా రూపకల్పనలో సహకరించాలి.
X

దిశ,పెద్దపల్లి : గ్రామీణ ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సంపూర్ణ సహకారం అందజేయాలని, ఓటరు జాబితా రూపకల్పన పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కోరారు. గ్రామీణ ఓటర్ల జాబితా రూపకల్పన పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ తో కలిసి సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికల నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా రూపకల్పనకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని, ఈ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 13న గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ప్రదర్శించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

గ్రామీణ ఓటరు జాబితాలో ఉన్న అభ్యంతరాలు, నూతన ఓటరు నమోదుకు సెప్టెంబర్ 21 వరకు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బ్రహ్మయ్య, సీపీఐ పార్టీ ప్రతినిధి టి. సదానందం, తెదేపా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎ.తిరుపతి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి శశి భూషణ్, భారాసా పార్టీ ప్రతినిధి ఉప్పు రాజ్ కుమార్, భాజపా పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ పి.సంపత్ రావు, సీపీఎం పార్టీ ప్రతినిధి ముత్యం రావు, బీఎస్పీ పార్టీ ప్రతినిధులు శారద రాజ నర్సింగ్, కాంగ్రెస్ పార్టీ రామగుండం ఇన్చార్జి ఆశ్ పాషా, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed