Postal Inspector : ప్రతి గడపలో పోస్టల్ స్కీమ్ ఉండాలన్నదే లక్ష్యం..

by Sumithra |
Postal Inspector : ప్రతి గడపలో పోస్టల్ స్కీమ్ ఉండాలన్నదే లక్ష్యం..
X

దిశ, రామడుగు : పోస్టల్ పథకాలు, సేవల పై ఇప్పటికే విస్తృత ప్రచారం కల్పించిన తెలంగాణ తపాల శాఖ మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతిగడపలో పోస్టల్ పథకాలు ఉండాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ముఖ్యంగా గ్రామాల్లోని ప్రజలను పథకాలలో భాగస్వాములను చేయాలనే సంకల్పంతో డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం (DCDP) పేరిట ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం దేశరాజుపల్లి గ్రామంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కరీంనగర్ నార్త్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ పోస్టల్ పథకాలు, సేవల పై కూలంకషంగా వివరించారు.

ఆర్థిక ప్రయోజనం చేకూరే పోస్టల్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా వివిధ ఖాతాలు తీసుకున్న ఖాతాదారులకు పాసు బుక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ ఎంఓలు దాది మల్లేశం, మర్రి శేఖర్, దేశరాజుపల్లి బ్రాంచి పోస్టుమాస్టర్ జానంపేట మారుతితో పాటు కొత్తపల్లి సబ్ పోస్టాఫీసు పరిధిలోని బ్రాంచి పోస్టుమాస్టర్లు, అసిస్టెంట్ బ్రాంచి పోస్టుమాస్టర్లు, గ్రామ ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story