అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు బుద్ధి చెప్పండి : బండి సంజయ్

by Disha Web Desk 23 |
అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు  బుద్ధి చెప్పండి : బండి సంజయ్
X

దిశ,మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు లో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘దళిత సమ్మేళనం’కు బండి సంజయ్ హజరైయ్యారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. ఐఎన్ సీ అంటే ‘‘ఇటలీ నేషనల్ కాంగ్రెస్’’ అని ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇండియాది కాదని, బ్రిటిష్ వాడు స్థాపించారని చెప్పారు. అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనే బ్రిటీష్ సివిల్ సర్వంట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన విషయాన్ని ఎద్దేవా చేశారు. ‘‘బ్రిటిష్ పార్టీని ఇటలీ నేత ఏలుతున్నరని.. కామెంట్ చేశారు. భారతీయతను సంతరించుకున్న పార్టీ బీజేపీ. ఈ దేశ ముద్దు బిడ్డలు వాజ్ పేయి, అద్వానీ స్థాపించిన పార్టీ బీజేపీ. కాంగ్రెస్ లో భారతీయత ఎక్కడుందన్నారు.

మోదీ హయాంలోనే దేశానికి, ధర్మానికి రక్ష అని, ఈ దేశంలో శాంతిభద్రతలు కొనసాగుతున్నాయంటే... దేశం సురక్షితంగా ఉందంటే అది మోదీ చలువేనని ఏ జవాన్ ను అడిగిన చెబుతారని పేర్కొన్నారు. 57 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడూ దళితుల అభ్యున్నతికి పనిచేయలేదు అని, అంబేద్కర్ ను అడుగడుగున అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. దళితుల హక్కులపై మాట్లాడుతున్న అంబేద్కర్ ను అడ్డుకున్న వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ అని,రాజీనామా చేసి బయటకు వచ్చి పోటీ చేస్తే అనేక కుట్రలు చేసి అంబేద్కర్ ను ఓడించి దారుణంగా అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

అంబేద్కర్ మరణిస్తే ఆయన పార్థివదేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా ముంబయి తరలించి అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని హామీ ఇచ్చి ఓట్లు దండుకుని కేసీఆర్ దళితులను మోసం చేశాడని, మాట ఇస్తే తల నరుక్కుంటానే తప్ప మాట తప్పనన్న కేసీఆర్ ఎన్నడైనా మాట మీద నిలబడ్డారా? దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఓట్లు దండుకుని చివరకు అభివృద్ధి పేరుతో దళితుల భూమినే గుంజుకున్న చోర్ కేసీఆర్ రే కదా అని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూచ తప్పకుండా అమలు చేసే పార్టీ బీజేపీ అని అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న మహానేత మోదీ అని ప్రధాని పదవి అంబేద్కర్ భిక్షేనని నిండు పార్లమెంట్ లో చాటి చెప్పిన నేత మోదీ అని అన్నారు. దళిత సమ్మేళనం లో బండి సంజయ్ తో పాటు ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్, మాజీ అధ్యక్షుడు కొప్పు భాష, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్, రాష్ట్ర నాయకులు సురేష్, శ్రీనివాస్, సొల్లు అజయ్ వర్మ సోమిడి వేణు, తదితరులు హాజరయ్యారు.



Next Story

Most Viewed