- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అన్ని రంగాలలో ముందున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: Minister Srinivas Goud
దిశ, కరీంనగర్ టౌన్: గ్రామీణస్థాయి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనతో రాష్ట్రంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ పట్టణంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి జిల్లాకు వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో రూ. 7కోట్ల ఖేలో ఇండియా నిధులతో నిర్మించిన 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్‌ను ప్రారంభించి, 100 మీటర్ల పరుగుపందెం, షార్ట్ ఫుట్ క్రీడలను పారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ.. తెలంగాణలో నాటి అభివృద్ధికి నేటి అభివృద్ధికి తేడా చూడాలని అన్నారు. సమైక్యపాలనలో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని ఫైరయ్యారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా 7800 గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండోర్ స్టేడియం నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని, ఇప్పటి వరకు 45 స్టేడియాల నిర్మాణాలను పూర్తి చేసుకోగా, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. క్రీడాపాలసీ కామన్ వెల్త్‌లో తెలంగాణ 2వ స్థానంలో నిలిచిందని తెలిపారు. కరీంనగర్‌లో క్రికెట్ స్టేడియం నిర్మించే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, నిర్మాణానికి చర్యలు తీసుకొంటామన్నారు.
అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. సమైక్యపాలనలో తెలంగాణకు అన్ని రంగాల్లో వివక్ష జరిగిందని, క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించలేదని ఆరోపించారు. స్వయంపాలనలో విద్య, వైద్యంతో పాటు క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ తెలంగాణలో నాలుగవదని, ఈ సింథటిక్ ట్రాక్ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలకు సిద్ధమయ్యే వారికి ఉపయోగపడుతుందని అన్నారు. పాత పీజీ కాలేజీ స్ధలంలోని 12 ఎకరాలలో క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని, క్రీడలకు కోచ్‌లను నియమించాలని కోరారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కరీంనగర్‌ను సీఎం కేసీఆర్ ప్రత్యేక అభిమానంతో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. నాడు కరీంనగర్ ఎంపీగా ఉన్న కేసీఆర్ కరీంనగర్ అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ నాటి పాలకులు పట్టించుకోలేదన్నారు. కరీంనగర్ విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వం గర్వపడే విధంగా క్రీడల్లో రాణించాలని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి విమర్శకులే అభినందిస్తున్నారని అన్నారు. క్రీడాకారులు తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలపాలని, కరీంనగర్‌లో క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఐదు సంవత్సరాలలోగా కరీంనగర్లో క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేసి రంజీ మ్యాచులు ఆడే విధంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మేయర్ సునీల్ రావు, ఇంచార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ లెనిన్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, జమ్మికుంట మున్సిపల్ చైర్పెర్సన్, జిల్లా టూరిజం అధికారి వెంకటేశ్వర్లు, రాజేశ్వర్ రావు, డిడి స్పోర్ట్స్ ధనలక్ష్మి, సుజాత, హరికృష్ణ, జిల్లా క్రీడాల అభివృద్ధి అధికారి కీర్తి రాజవీరు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.