- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల కర్కశం
దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ఎంతటి నేరం చేసిన నేరస్తుడికైన జైల్లో రాఖీ కట్టడానికి అధికారులు అనుమతిస్తారు. కానీ రాఖీ పౌర్ణమి వేల తోబుట్టువులకు రాఖీ కట్ట నివ్వకుండా ఉపాధ్యాయులు నేరస్తుల కంటే విద్యార్థులపై కర్కోశంగా వ్యవహరించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిల చేత రాఖీ పండుగ సందర్భంగా సోమవారం రాఖీలు కట్టించుకోవడానికి తమ తోబుట్టువులను తీసుకుని తల్లిదండ్రులు వచ్చారు. కానీ రాఖీలు కట్టకుండా పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాఠశాల గేట్ తెరవకుండా చాలా కఠినంగా వ్యవహరించారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
కనీసం గేటు బయటకు పంపించమని అడిగినా కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక ఆశగా వచ్చిన అన్నదమ్ములకు విద్యార్థులు కిటికీలోంచి రాఖీ కట్టవలసిన పరిస్థితులు నెలకొన్నాయని మండిపడుతున్నారు. తల్లిదండ్రులు తన బిడ్డలతో గేటు బయట నిరీక్షిస్తున్న ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో సోషల్ మీడియా వేదికగా ఆయా గురుకుల, కస్తూర్బా, హాస్టల్ లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులతో ఆయా వసతిగృహాలను తనిఖీ చేసి, సంబంధిత ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నేటిజన్లు కోరుతున్నారు.