బీఆర్ఎస్ పార్టీ నుండి ఇద్దరు సస్పెన్షన్

by samatah |   ( Updated:2022-12-17 14:45:23.0  )
బీఆర్ఎస్ పార్టీ నుండి ఇద్దరు సస్పెన్షన్
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి : పార్టీ క్రమ శిక్షణ నిబంధనలు ఉల్లఘించిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తాఫనగర్‌కు చెందిన కొక్కు దేవేందర్ యాదవ్‌ను వీర్నపల్లి మండలం బాబాయి చెరువు తండాకు చెందిన భూక్య సంతోష్ నాయక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో నామినేషన్లు ఉపసంహరించుకోవాలని చెప్పినా వినకుండా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.

Advertisement

Next Story