- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విధి నిర్వహణకు క్రీడలు ఎంతగానో దోహదపడుతాయి : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
పోలీస్ అన్యువల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ సిరిసిల్ల మినీ స్టేడియంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై పావురాలు, బెలూన్స్ ఎగురవేశారు. అనంతరం పోలీస్ సిబ్బంది ఒలంపిక్ క్రీడాజ్యోతిని పట్టుకుని పరేడ్ గ్రౌండ్ చుట్టూ తిరిగారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించి క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందన్నారు.
ఆటల్లో గెలుపోటములు సహజమని, వాటి కంటే టీమ్ స్పిరిట్ గొప్పదన్నారు. అధికారులకు సిబ్బంది ప్రతి ఒక్కరికి డ్యూటీ, ఫ్యామిలీ ఒత్తిడి ఉంటుందని క్రీడలు ఆడటం వలన మానసిక ఉల్లాసం కలుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. పోలీస్ విభాగంలో విధినిర్వహణలో క్రీడలు అనేవి ఎంతో అవసరమైనవని అన్నారు. అనంతరం ఎస్పీ అఖిల్ మహాజన్ షటిల్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ సిబ్బందితో కలసి ఆడి అందరిలోనూ ఉత్సాహాన్ని నింపారు.
ఈ పోటీలు రెండు రోజుల పాటు DAR హంటర్, సిరిసిల్ల స్టైకైర్స్, వేములవాడ విక్టర్స్, వేములవాడ రుద్రస్, సిరిసిల్ల సోల్జర్స్, DAR రేంజర్స్ జట్ల మధ్య క్రికెట్, షటిల్ బ్యాట్మెంటన్, వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ, హై జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జవలిన్ మరియు అథెలిటిక్స్ క్రీడలు సాగనున్నాయి. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు విశ్వప్రసాద్, నాగేంద్ర చారి, రవికుమార్, సీఐలు అనిల్ కుమార్, ఉపేందర్, మోగిలి, వెంకటేష్, బన్సీలాల్, కిరణ్, కరుణాకర్, మాధుకర్, ఆర్.ఐలు రజినీకాంత్, కుమార స్వామి, యాదగిరి, ఎస్.ఐలు, ఆర్.ఎస్.ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.