శివరాత్రి రోజు ఈటల ప్రత్యేక పూజలు

by samatah |
శివరాత్రి రోజు ఈటల ప్రత్యేక పూజలు
X

దిశ, శంకరపట్నం: హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, రాష్ట్ర బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ శనివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని, కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం లోని, శంకరపట్నం మండలం చింతలపల్లె గ్రామంలోల శ్రీ భ్రమరామ మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రాజేందర్ మాట్లాడారు. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో దినదినం రాష్ట్రము అభివృద్ధి చెంది రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు ఏనుగుల అనిల్, సీనియర్ నాయకులు పల్లె శివారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ నిమ్మశేట్టి వీరస్వామి, దేవాలయం మాజీ చైర్మన్ పల్లె మనోహర్ రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, మస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed