- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలిః కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలిః కలెక్టర్ కోయ శ్రీ హర్ష
by Nagam Mallesh |
X
దిశ, కాల్వ శ్రీరాంపూర్ : ప్రభుత్వ వసతి గృహాల పరిధిలో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నాటిన మొక్కల సంరక్షణకు వాచర్స్ ను నియమించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కాల్వ శ్రీరాంపూర్ ఎంపీడీవో కార్యాలయంలో పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా, మొక్కల పెంపకం, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గ్రామాలలో జరుగుతున్న పారిశుధ్యం, వన మహోత్సవ కార్యక్రమం, త్రాగునీటి సరఫరా తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు పక్కా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని, గ్రామాల పరిధిలోని ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ పంచాయతీ కార్యదర్శి లను ఆదేశించారు.గ్రామాలలో ఎక్కడ డార్క్ ఏరియా ఉండటానికి వీలులేదని, అవసరమైన చోట వెంటనే వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వన మహోత్సవం కార్యక్రమం క్రింద 100% మొక్కల నాటే లక్ష్యం పూర్తయిందని తెలుసుకున్న కలెక్టర్ వాటి సంరక్షణకు వాచర్స్ ను నియమించాలని అధికారులకు సూచించారు.
Advertisement
Next Story