ధూమపానం ఆరోగ్యానికి హానికరం

by Shiva |
ధూమపానం ఆరోగ్యానికి హానికరం
X

వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ

దిశ, పెద్దపెల్లి కలెక్టరేట్ : బుధవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ నుంచి తెలుగు తల్లి కూడలి వరకు అక్కడి నుంచి తిరిగి ఎం.సీ.హెచ్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని 1987లో ప్రారంభించారని, పొగాకు ఉత్పత్తుల వాడకం మూలంగా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందన్నారు. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని, పొగాకు ఉత్పత్తులను వాడి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం వలన పర్యావరణానికి ముప్పు ఉందని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం చట్ట విరుద్ధమని, 18 ఏళ్ల లోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులను విక్రయించకూడదని తెలిపారు.

అనంతరం పొగాకు ఉత్పత్తులను వాడబోమని ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పురుషోత్తం ప్రతిజ్ఞ చేయించారు. ఈ అవగాహన ర్యాలీలో కంటి వెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మహేందర్ కుమార్, రాఘవాపూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లావణ్య, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, ఎన్.సీ.డీ కో-ఆర్డినేటర్ రాజేష్ , ఐ.ఆర్.సీ.ఎస్ అధ్యక్షుడు కావేటి రాజగోపాల్, ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed