- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొచ్చేదాక రామలింగం.....సొచ్చినంక రా..రా..లింగం
దిశ, సిరిసిల్ల : సొచ్చేదాక రామలింగం.....సొచ్చినంక రా..రా..లింగం అనే చందంగా ఉంది కొంతమంది నాయకుల వైఖరి. ప్రజల కొరకు పాటుపడతామని, ప్రజల సమస్యలు తీరుస్తామని, ప్రజాభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, సంస్థ మనుగడకు కృషి చేస్తామని ఓట్లకు ముందు ప్రగల్భాలు పలికి, ఓటు వేయించుకుని గెలిచాక, పదవి అందగానే, ఓట్లు వేసిన వారినే మరచి, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ, ప్రజల నడ్డి విరిచేలా కార్యక్రమాలు చేపడుతూ, ఇదేం అని నిలదీస్తే, చట్టాలను గౌరవించి, అమలు చేయడమే మా పనంటూ సూక్తులు పలకడం పరిపాటిగా మారింది నేడు కొంతమంది నాయకులకు!.
అచ్చం ఇలాంటి స్టోరి నే సిరిసిల్ల సెస్‌లో జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. సిరిసిల్ల సెస్ పరిధిలో నూతనంగా సిరిసిల్ల టౌన్ నుండి ఎన్నికైన ఓ డైరెక్టర్ విద్యుత్ బకాయిలు పెరగడానికి కారణాలు అన్వేషించకుండా, బకాయిలు వసూలు చేసే ప్రణాళికలు రూపొందించకుండా, విద్యుత్ బకాయిదారుల కనెక్షన్ కట్ చేయమని సెస్ సాధారణ సమావేశంలో తెల్పడం విస్మయానికి గురిచేస్తుంది.
అసలు విద్యుత్ బకాయిలు వసూలు అయ్యేలా ప్రణాళికలు రూపొందించకుండా, విధి విధానాలు ప్రజలకు ఎలా ఉపయుక్తంగా ఉంటాయో ఆలోచించకుండా, బకాయిలు చెల్లించేలా సరైనా గడువు ఇవ్వకుండా బకాయిదారుల కనెక్షన్ కట్ చేయమనడం ప్రజా వ్యతిరేక విధానం కాదా అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సంస్థ మనుగడ కొనసాగాలంటే వినియోగదారులందరి పూర్తి భాగస్వామ్యం ఉండేలా డైరెక్టర్లు పలు విధనాలు రూపొందాల్సిన బాధ్యత వారిదేనన్న విషయాన్ని మరిచిపోతున్నారని రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కైనా నూతనంగా ఎన్నికైన సదరు డైరెక్టర్ ప్రజా ప్రయోజన కార్యక్రమాలు, సంస్థ మనుగడ కొనసాగే ప్రణాళికలు రూపొందించేలా వ్యవహరిస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.
అసలు బకాయిలు పెరిగిందే పాలకుల తీరువల్ల
అసలు బకాయిలు పెరిగిందే పాలకుల తీరు వల్ల, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ఇస్తామని, టిడిపి అధికారంలోకి వస్తే బకాయిలు మాఫీ చేస్తామనటం వల్లే ప్రజలు బకాయిదారుల మారాల్సి వచ్చింది. ఈ విషయాన్ని మరచి బకాయిదారుల కనెక్షన్ కట్ చేస్తామంటే సరికాదు.బకాయిల వసూళ్ళకు దశల వారీగా,ప్రజలకు అనుకూలమైన విధంగా కార్షక్రమాలు చేపట్టాలి.అంతేగాని కనెక్షన్‌లను కట్ చేస్తామంటే ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమాలు చేపడతాం.-లింగంపల్లి మధుకర్ ,బి ఎస్ పి పార్టీ జిల్లా కార్యదర్శి & సిరిసిల్ల అసెంబ్లీ ఇంచార్జ్.