- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెద్దల మందుల పంచాయతీ పేదలకు ప్రాణం మీదకు వచ్చింది
దిశ, వెల్గటూర్: గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు మధ్య నెలకొన్న మందుల కాంట్రాక్టు బకాయిల పంచాయతీ పేదల ప్రాణం మీదకు వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖలో కోడై కూస్తోంది. పెద్దల మందుల పంచాయతీ పేదలకు ప్రాణ సంకటంగా మారిందిని సర్కార్ దవాఖానాల పనితీరుపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్కార్ దావఖానలకు మందులు పంపిణీ చేసే ప్రక్రియను టెండర్ ద్వారా కాంట్రాక్టర్ కు అప్పగించి పంపిణీ చేశారు. మందుల కొరత కూడా లేకుండా పంపిణీ సక్రమంగానే జరిగింది. ఏడాది క్రితం ఎన్నికలు రావడం.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తిరిగి సర్కార్ దవాఖానాలకు మందులు పంపిణీ చేసే టెండర్ ప్రక్రియకు ప్రభుత్వం తెర తీసింది. అక్కడే ట్విస్ట్ ఏర్పడింది . టెండర్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. పేదలకు సరైన మందులు అందక ప్రాణ సంకటంగా మారింది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెండర్ తీసుకొని సర్కారు దవాఖానాలకు మందులు పంపిణీ చేసిన కాంట్రాక్టర్ కు ఆ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్లినట్టు సమాచారం. అయితే బకాయిలైన చెల్లించండి లేదంటే కొత్తగా పిలిచే టెండర్ ను నాకే ఇవ్వాలని పాత కాంట్రాక్టర్ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి మెలిక పెట్టాడు. దీంతో మందుల పంపిణీ పీ కొంత కాలంగా పేచీ మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలో పాత ప్రభుత్వం పెట్టిన బకాయిలను తాము ఎందుకు చెల్లిస్తామని కొత్త ప్రభుత్వం మొండి పట్టు పట్టిందని, పాత కొత్త ప్రభుత్వ పెద్దల మధ్య ఏర్పడిన బకాయిల పంచాయతీ వల్ల టెండర్ ప్రక్రియ ఆలస్యం కావడం తోనే సర్కార్ దవాఖానల్లో మందుల కొరత ఏర్పడిందని వైద్య ఆరోగ్యశాఖ లో బోగట్టా.
రోగుల మందుల తంటాలు..
వెల్గటూర్ మండలంలోని సర్కారు దవాఖానలో మందుల కొరత కొన్నాళ్లుగా రోగులను తీవ్రంగా వేధిస్తోంది. గత మూడు నెలలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐ డ్రాప్స్ లేకపోవడం, యాంటి బయాటిక్స్ మందులు సైతం అంతత మాత్రమే అందుబాటులో ఉండటం తో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటిలో ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. సర్కార్ దవాఖానకు వచ్చే రోగుల్లో ప్రధానంగా ఎవరూ లేని వృద్దులు, నిరుపేదలు మాత్రమే వస్తుంటారు. వారికి కూడా సరిపడా మందులు అందుబాటులో ఉండటం లేదు.
వృద్దులైతే ఐ డ్రాప్స్ కోసం గుడి చుట్టూ తిరిగినట్టు ప్రతి వారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి నిరాశతో వెళ్ళటం రోగులను తీవ్రమైన మానసిక వేదనకు గురి చేస్తుంది. కొద్ది రోజుల క్రితం పేద ప్రజలకు అవసరమయ్యే బీపీ, షుగర్ మాత్రలు సైతం అన్ని రకాలు అందుబాటులో లేకపోవడం యాంటి బయాటిక్స్ ఇతరత్రా మందులను సగం సగం మాత్రమే రోగులకు ఇవ్వడం ఇక్కడ విశేషం. ఫలితంగా వర్షాకాలం సీజన్ లో తీవ్రమైన వైరల్ ఫీవర్స్, డెంగ్యూ జ్వరాలను ఎదుర్కొన్న సామాన్యులు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకొని ప్రాణాలను దక్కించుకున్న ఘటనలు ఉన్నాయి .
ఆరు నెలలుగా ఇక్కడ వైద్యులే లేరు
ఆరు నెలల క్రితం ఇక్కడి నుండి వైద్యుడు బదిలీపై వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మల్టీ లెవల్ హెల్త్ ప్రొవైడర్ తో వైద్య సేవలను రోగులకు అందించడం విశేషం. కాగా గత నాలుగు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి నూతనంగా నియమించిన ఇద్దరు వైద్యులు వెల్గటూర్ పీహెచ్సీ లో జాయిన్ అవ్వడం సంతోషకరం. అయితే కొత్తగా ఇద్దరు వైద్యులు నియామకమైన మందుల కొరత అటు ఆసుపత్రి సిబ్బందిని ఇటు రోగులను తీవ్రంగా వేధిస్తుండటం గమనార్హం. పేదల ప్రభుత్వంగా ఏడాది క్రితం గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ వైద్యాన్ని సామాన్యులకు అందించే విధంగా కృషి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సామాన్య ప్రజలు రోగాల బారిన పడి ఇబ్బందులు పడక ముందే మందుల బకాయిల పంచాయతీకి చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది.