Avanthi Srinivas: ఆ ఇద్దరి వల్లే భీమిలి ఎమ్మెల్యేగా గెలిచా.. అవంతి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |
Avanthi Srinivas: ఆ ఇద్దరి వల్లే భీమిలి ఎమ్మెల్యేగా గెలిచా.. అవంతి శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ జిల్లా (Vishakha District)లో కీలక నేతగా ఉన్న భీమిలీ (Bhimili) నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇవాళ వైసీపీ (YCP)కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని వైసీపీ (YCP) అధిష్టానానికి పంపారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లుగా అవంతి ఆ లేఖలో వెల్లడించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి (Chiranjeevi) ఆశీస్సులతో 2009లో తాను రాజకీయాల్లో్కి వచ్చానని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), నాగబాబు (Nagababu) వల్లే తాను భీమిలి ఎమ్మెల్యే (Bhimili MLA)గా గెలుపొందానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో నయా పైసా కూడా అవినీతికి పాల్పడలేదంటూ భావోద్వేగానికి గురయ్యారు.

కానీ, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు తనను ఎందుకు తిరస్కరించారో అర్థం కావడం లేదని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని.. 6 నెలల నుంచే వారిపై ప్రతిపక్షంగా తాము వారిపై మాటల దాడికి దిగడం మంచిది కాదని భావించానని తెలిపారు. వైసీపీ (YCP)లో కార్యకర్తలు, నాయకులకు గౌరవం కొరవడిందంటూ కామెంట్ చేశారు. అందరినీ అడగకుండానే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఓ వైపు జమిలి ఎన్నికలు (Jamili Elections) ముంచుకొస్తున్నాయని.. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేయాలంటూ వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతీ విషయంలోనూ రాజకీయ ప్రయోజనాలే పరమాధిగా ఆ పార్టీ పని చేస్తోందని అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed