- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maharashtra : పదవుల పంపకాలపై ఉత్కంఠ.. థానేలోనే షిండే.. ఢిల్లీకి అజిత్, ఫడ్నవిస్
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వమైతే కొలువుతీరింది. ఇక కీలకమైన మంత్రి పదవుల పంపకాల వ్యవహారం మిగిలింది. బీజేపీ, అజిత్ పవార్ -ఎన్‌సీపీ, ఏక్‌నాథ్ షిండే -శివసేనల మధ్య కీలకమైన నాలుగైదు మంత్రి పదవుల పంపకాలపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. హోంశాఖ, రెవెన్యూశాఖలను తమ వద్దే ఉంచుకుంటామని బీజేపీ తేల్చి చెప్పింది. అర్బన్ డెవలప్‌మెంట్ శాఖను డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde)కు, ఆర్థికశాఖను డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar)కు కేటాయించారు. మిగిలిన శాఖల పంపకాలపై తేల్చుకునేందుకు సీఎం దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis), డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కలిసి ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలతో వారు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు సెపరేటుగా ఏక్‌నాథ్ షిండే కూడా వెళ్తారనే టాక్ మహారాష్ట్ర మీడియాలో వినిపిస్తోంది.
అయితే షిండే ఢిల్లీకి ఇప్పట్లో వెళ్లే అవకాశమే లేదని, థానేలోని నివాసంలోనే ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ‘‘మేం చాలా శాఖలు అడిగాం. కానీ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ఒక్కటే ఇచ్చారు. రెవెన్యూ, పబ్లిక్ వర్క్స్, రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, హౌసింగ్, ఎనర్జీ శాఖలను మేం కోరుకుంటున్నాం. కానీ బీజేపీ వాళ్లు వినడం లేదు’’ అని షిండే సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఫడ్నవిస్, అజిత్ పవార్‌లు శుక్రవారం వరకు ఢిల్లీలోనే ఉండి, మంత్రి పదవుల పంపకాలపై పూర్తి క్లారిటీతో ముంబైకి తిరిగొస్తారని తెలుస్తోంది. షిండే ఒకవేళ ఈ సమావేశానికి గైర్హాజరైతే.. షిండే సేనకు మంత్రి పదవుల కేటాయింపుపై బీజేపీ పెద్దలు ఎలాంటి తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో జరిగిన మహాయుతి కూటమి సమావేశాల్లో బీజేపీకి 22, షిండే శివసేనకు 11, ఎన్‌సీపీకి 10 మంత్రిత్వ శాఖలను కేటాయించాలనే అంగీకారానికి వచ్చారు.