ఆ ఆలయంలో అఖండ దీపం నేటికి దేదీప్యమానంగా వెలుగుంది...

by Sumithra |   ( Updated:2023-05-24 09:18:31.0  )
ఆ ఆలయంలో అఖండ దీపం నేటికి దేదీప్యమానంగా వెలుగుంది...
X

దిశ, గంభీరావుపేట : సుమారు 7 శతాబ్దాల చరిత్ర గల ఆలయం సీతారామస్వామి ఆలయం. ఇది కాకతీయుల కాలంలో నిర్మింపబడి వారి ఆధ్యాత్మికత వైభవానికి ప్రతీక ఈ ఆలయం. ప్రాచీన రాతి శిలలచే నిర్మించి ప్రజా శ్రేయస్సుకై నాడు వారు వెలిగించిన దీపం అఖండ దీపమై నేటికి దేదీప్యమానంగా వెలుగుతూ ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాల్లో భాగమైంది. ఈ ఆలయ మరో ప్రత్యేకత మూలవిరాట్టు భద్రాచల రామయ్యను పోలి ఉండటం, 16 రాతి స్తంభాలతో ఏర్పాటైన గర్భాలయం,16 రాతి స్తంభాలతో కూడిన ముఖమండపం,16 రాతి స్తంభాలతో కూడిన కళ్యాణమండపం. ఈ ఆలయ చరిత్రను తెలియజేస్తూ ఆలయంలోని పురాతన గంట పైన సంస్కృత భాషలో లిఖించారు.

ఇంతటి పురాతన ఆధ్యాత్మికత కలిగిన సీతారామస్వామి ఆలయం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రంలో కలదు. ఈ ఆలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమిని పురస్కరించుకొని నవాంహిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ వాహన సేవలు అశ్వ, గజ, శేష, సూర్యప్రభ, పొన్న, గరుడ, రథోత్సవంతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. చుట్టుపక్క గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో గరుడసేవ, రథోత్సవంను తిలకించి తరిస్తారు. 2018న ఆలయ పున్నిర్మాణం ప్రారంభించి ఆలయ గోపురం, సలారం, ప్రతిష్ట చేశారు. పు:నర్నిర్మాణం కోసం భక్తులు విరాళాలు అందించి సహకరించారు. ఇకపోతే ఆలయ గాలిగోపురం పూర్తి చేయవలసి ఉంది. పురాతన ఆలయాల పునర్నిర్మాణం కోసం దాతలు ముందుకు రావాలని ఆలయ కమిటీ కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed