దళితుల అభ్యున్నతికి సీఎం పెద్దపీట వేస్తున్నారు: బండ శ్రీనివాస్

by S Gopi |   ( Updated:2022-12-28 14:05:26.0  )
దళితుల అభ్యున్నతికి సీఎం పెద్దపీట వేస్తున్నారు: బండ శ్రీనివాస్
X

దిశ, హుజూరాబాద్: దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్ స్పష్టం చేశారు. పట్టణానికి చెందిన అందె తిరుపతి, ఎర్ర విజయ, బొరగాల జయలకు దళితబంధు పథకం ద్వారా మంజూరైన మెడికల్ ఏజెన్సీని అయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలలో వెనుక బడిన దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు దళితబంధు పథకం ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ఈ పథకాన్ని లబ్దిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు ఇమ్రాన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story