రుషికేశ్ మృతదేహం లభ్యం

by Shiva |   ( Updated:2023-03-06 10:19:23.0  )
రుషికేశ్ మృతదేహం లభ్యం
X

దిశ, హుజూరాబాద్: మండల పరిధిలోని పెద్దపాపయ్యపల్లి వద్ద కాకతీయ కెనాల్ లో రుషికేశ్ మృతదేహం లభ్యమైంది.కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదులగట్టెపల్లి కాకతీయ కాలువలో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం బీటెక్ విద్యార్థి రుషికేశ్ ఈతకు వెళ్లాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రుషికేశ్ కెనాల్లో గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడి బంధువులు వెంటనే మానకొండూర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు.

స్పందించిన అక్కడి పోలీసులు శంకరపట్నం, హుజూరాబాద్, ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్లకు సమాచారమిచ్చారు. పోలీసులు గాలిస్తున్న క్రమంలో ఓ యువకుడి మృతదేహం కాకతీయ కాలువలో కొట్టుకుపోతోందని స్థానికులు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి బంధువులు కెనాల్ లో నుంచి రుషికేశ్ మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed