రూరల్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలి

by Shiva |
రూరల్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలి
X

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఎంపీటీసీలు

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల రూరల్ ఎంపీపీ పదవికి వెంటనే నియామక ప్రక్రియ చేపట్టాలని పలువురు ఎంపీటీసీలు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. గతంలో ఎంపీపీగా పని చేసిన గాజర్ల గంగారం మృతి చెందడంతో ఇన్ చార్జి ఎంపీపీగా పాలెపు రాజును నియమించారు. రూరల్ ఎంపీపీ పదవిని బీసీ జనరల్ కు చెందిన వారికి కేటాయించగా ప్రస్తుతం ఓసీ వర్గానికి చెందిన వ్యక్తినే ఇన్ చార్జి గా కొనసాగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ నిబంధనలు ఉల్లంఘించడమే అవుతోంది కాబట్టి రెండేళ్లన నుంచి ఖాళీగా ఉన్న స్థానంలో ఎన్నిక నిర్వహించి కొత్త ఎంపీపీ నియామకం చేపట్టాలని కలెక్టర్ ను కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఎంపీటీసీలు లక్ష్మి, జమున, మమత, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story