- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు సహకరించాలి: కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
దిశ, కోరుట్ల: యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు సహకరించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం రైస్ మిల్లర్ల యాజమాన్యంతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లుకు తరలించిన ధాన్యాన్ని త్వరగా దింపుకోవాలని, రైస్ మిల్లర్లు రైతులకు అన్ని విధాలుగా చేదోడుగా ఉండాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, రైసు మిల్లుల్లో రైతులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలన్నారు. తప్ప తాలు పేరుతో ధాన్యం తూకంలో అవకతవకలకు పాల్పడవద్దన్నారు.
నిర్వాహకులు టోకెన్ పద్ధతిని పాటిస్తూ రైతులకు సహకరించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం నుంచి మొదలై ధాన్యం రైస్ మిల్లులకు చేరే వరకు అధికారులదే పూర్తి బాధ్యతని తెలిపారు. ఈ సమావేశంలో కోరుట్ల ఆర్డీవో వినోద్ కుమార్, డీపీవో రామనుజచార్యులు, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఎంసీఎస్ రజనీకాంత్, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోకా బాపురెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు చీటి వెంకట్రావు, ఎంపీపీలు తోట నారాయణ, సాయిరెడ్డి, జడ్పీటీసీలు సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దారిశెట్టి లావణ్య రాజేష్, కమటం భారతి రమేష్, ప్యాక్స్ చైర్మన్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.