ఆరని ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగాల దందా...

by Sumithra |   ( Updated:2023-04-02 09:49:52.0  )
ఆరని ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగాల దందా...
X

దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాల దందా వ్యవహారంలో ఇంకా మంటలు చెల్లరేగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే, అఖిలపక్షం నేత కాసిపేట లింగయ్యతో రామగుండం కార్పొరేషన్ పదవ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య మధ్య నిన్న రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన సానిల్ ప్రాంగణంలో ఆయన సమక్షంలోనే ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కాంట్రాక్టర్లు కార్పొరేటర్ పై దాడికి పాల్పడ్డట్టు తెలిసింది. ఉద్యోగాలు విషయంలో కొంతమంది బాధితలు నుండి కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య ఇరువై లక్షల వరకు వసూలుచేసి కర్మాగారం కాంట్రాక్టర్లు గుండురాజు మరికొందరికి అప్పగించాడు.

అయితే రెండేళ్ల నుంచి పనిలేక డబ్బులు తిరిగి ఇవ్వలేకపోవడంతో బాధితులు కార్పొరేటర్ ను వేధిస్తున్నారు. ప్లాంట్ కాంట్రాక్టర్లకు, బాధితులకు మధ్య అఖిలపక్షం నాయకునిగా మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. బాధితులకు డబ్బులు ఇవ్వాల్సి ఉండగా కార్పొరేటర్ గట్టయ్య అఖిలపక్ష నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కాసిపేట్ లింగయ్యను నిన్న రాత్రి సంప్రదించాడు. అదే సమయంలో అక్కడే ఉన్న కర్మాగారం కాంట్రాక్టర్లు గుండు రాజు, ముత్యం అనిల్ గౌడ్, పెంచాల తిరుపతి మద్యం మత్తులో ఉన్నారని కార్పొరేటర్ ఆరోపిస్తున్నాడు. ఇదే క్రమంలో డబ్బులు అడగడంతో వెంటనే దుర్భాషలాడుతూ తనపై దాడి చేశారని పేర్కొన్నాడు. బాధితులకు డబ్బులు ఇవ్వకుంటే తనను బాధితులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

డబ్బులు ఇస్తామని మోసం చేస్తున్న కాంట్రాక్టర్లు ?

ఆర్ఎఫ్సీఎల్ లో ఉద్యోగాలు పెట్టిస్తామని కోట్లాది రూపాయలు దండుకున్న కాంట్రాక్టర్లు మొదట డబ్బులు ఇస్తామని చెప్పి కొంత మేరకు ముట్టజెప్పి ఇప్పుడు దాడులకు తెగబడడం కొసమెరుపు. డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. దీనికి తోడు స్థానిక ఖాకీలు కూడా మద్దతు తెలుపుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బాధితుల మొర..

ఉద్యోగాలు వస్తాయని నమ్మకంతో కార్పొరేటర్ కు డబ్బులు ఇస్తే ఇంతవరకు ఇవ్వడం లేదని. ఇదే క్రమంలో కార్పొరేటర్ ఇంటి వద్ద బైఠాయించామని బాధితులు స్వప్న పేర్కొన్నారు. కూలిపని చేసుకునే తమకు దయచేసి డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. లేదంటే తమకు ఆత్మహత్యలు శరణ్యమని బాధితులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story