పొటాష్​ వాడకం తగ్గిస్తే నష్టమే

by Sridhar Babu |
పొటాష్​ వాడకం తగ్గిస్తే నష్టమే
X

దిశ, హుజురాబాద్ రూరల్ : మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి జొన్నలవాడి భాగ్యలక్ష్మి పంటలను పరిశీలించి రైతులకు సలహాలు, సూచనలు చేశారు. వరిలో సమగ్ర ఎరువుల వాడకంలో కాంప్లెక్స్ ఎరువులైన 20:20:0:13 లాంటివి వాడకూడదని, దీనిలో 13 శాతం గంధకం వల్ల పంటపై సల్ఫైడ్ ప్రభావంతో దెబ్బతింటుందన్నారు. రైతులు అధిక ధర ఉందని పొటాష్ని వాడడం తగ్గించారని, నాటు వేసిన 30 రోజులు లోపు పొటాష్ వేయాలని తెలిపారు.

వరి పంట పండించే పొలాల్లో రైతులు ప్రతి యాసంగిలో జింక్ సల్పేట్ ని ఎకరాకి 20 కిలోలు ప్రధాన మడిలో ఆఖరి దమ్ములో తప్పక వేయాలన్నారు. నాటువేసే ముందు నారు ఆకు కొనలు కత్తిరించి నాటాలన్నారు. పంటల నమోదు పక్రియలో ఏఈఓ లు క్షేత్ర సందర్శన చేసినప్పుడు రైతులు సాగు చేసిన పంటలను సర్వే నెంబర్ల వారీగా వివరాలు తెలపాలన్నారు. దీని ఆధారంగానే కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి చాడ భూంరెడ్డి, ఏఈఓ పొద్దుటూరి సతీష్, రైతులు మూల చంద్రశేఖర్ రెడ్డి, వంగల వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed