- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్.ఎఫ్.సీ.ఎల్ బాధితుల బాధ్యత రామగుండం ఎమ్మెల్యే దే..!
దిశ, గోదావరి ఖని: వడ్డీలకు అప్పులు తీసుకువచ్చి, అప్పులు కట్టలేక ఆత్మహత్య, ఆత్మహత్యయత్నాలు చేసుకున్న ఆర్.ఎఫ్.సీ.ఎల్ నిరుద్యోగ బాధ్యులకు ఎమ్మెల్యే, అతని అనుచరులే, బాధ్యులనీ మావోయిస్టు పార్టీ కోల్ బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ పేరిట ఒక లేఖ విడుదల చేశారు. శుక్రవారం మీడియా ఆయన మాట్లాడుతూ.. ఆర్.ఎఫ్.సీ.ఎల్ కాంట్రాక్టు కార్మికుల బాధితులకు, మావోయిస్టు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. అమాయక నిరుద్యోగులను ఆర్.ఎఫ్.సీ.ఎల్ (రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్) లో ఉద్యోగాల పేరిట, నిండా ముంచిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు.
ఆర్.ఎఫ్.సీ.ఎల్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెట్టించేందుకు, తన అనుచరులు, ఇతర రాజకీయ పార్టీల నాయకులతో, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రధాన పాత్ర పోషించి, అమాయక యువకుల నుంచి డబ్బు దండుకున్నారని తెలిపారు. ఉద్యోగాల బాధితులకు ఎమ్మెల్యే కోరుకంటి చెందరే బాధ్యత వహించి డబ్బు ఇప్పించాలని డిమాండ్ చేశారు. తన అనుచరులతో రూ.కోట్ల డబ్బు వసూలు చేయించి ఏమీ తెలవదు అన్నట్లు నటిస్తున్న చందర్, బాధిత కుటుంబాలకు డబ్బులు ఇప్పించే పూర్తి బాధ్యత వహించాలని వారు లేఖలో పేర్కొన్నారు.
ఎమ్మెల్యే అనుచరులతో పాటు, ఇతర రాజకీయ కార్మిక సంఘాల నాయకులు కూడా కొందరు, కాంట్రాక్టు ఉద్యోగాలు పెట్టిస్తామని అమాయక నిరుద్యోగుల నుంచి డబ్బు తీసుకుని, ఎమ్మెల్యే కోరుకంటి చందరే ఇచ్చినట్లు తమ నివేదికలో వెళ్లడైందన్నారు.దాదాపు 90 మంది బ్రోకర్లను 76 మందికి కుదించి, అఖిలపక్ష కమిటీ పేరిట డ్రామాలు ఆడించింది కూడా ఎమ్మెల్యే కోరుకంటి చెందరే ఆర్.ఎఫ్.సీ.ఎల్ కాంట్రాక్ట్ కార్మికుల వద్ద, ఉద్యోగాల పేరిట డబ్బులు తీసుకున్న బ్రోకర్ల పేర్లు ఎమ్మెల్యే ,అఖిలపక్ష కమిటీ, బయటపెట్టాలన్నారు.
అనేక ఉద్యమాలకు పురుడు పోసుకున్న కోల్ బెల్ట్ ప్రాంతం, ప్రజలు, కార్మికులు మహిళలు యువత నిత్య చైతన్యవంతులు అనేది గుర్తించకపోవడం, పాలక పార్టీల ప్రజా ప్రతినిధుల అజ్ఞానానికి నిదర్శనమని, రౌడీ షీటర్ల ను, క్యాంపెయిన్ గ్యాంగులను భూ కబ్జాదారులను తరిమికొట్టాలని అన్నారు. రామగుండం ప్రాంతాన్ని శాసించాలని చూస్తున్న చందర్ తో పాటు, ఇతర రాజకీయ పార్టీల, కార్మిక సంఘాల నాయకులకు ప్రజా కోర్టులో త్వరలోనే శిక్షిస్తామని హెచ్చరించారు.
అఖిలపక్ష కమిటీ ఆడిన డ్రామాల పేరిట 400 మంది ఆర్.ఎఫ్.సీ.ఎల్, బాధితులను అధికారికంగా గుర్తిస్తే.. ఉద్యోగాలు చేయకుండా, వివిధ కార్మిక రాజకీయ పార్టీల నాయకులకు ఆర్.ఎఫ్.సీ.ఎల్ కాంట్రాక్టు ఉద్యోగాల పేరిట, డబ్బులు ఇచ్చి తిరుగుతున్న వారు మరో 150 మంది ఉన్నారని ,వీటన్నింటిని కప్పిపుచ్చి, దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు, అఖిలపక్షం పేరిట ఎమ్మెల్యే ఆడించిన నాటకంలో, కొంతమంది అఖిలపక్ష కమిటీ నాయకులు అతిగా ప్రవర్తించడం, ప్రజలు కార్మికులు గమనించి ఉంటారన్నారు.
ఆర్.ఎఫ్.సీ.ఎల్ కాంట్రాక్టు ఉద్యోగాల బాధితుల్లో ఒకరు మృతి చెందడానికి, మరో కొంతమంది ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కూడా ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అనుచరులే, కారణమని ఆయన తెలిపారు. నాయకులు ఇప్పించిన చెక్కులు చెల్లక బాధ్యత కుటుంబాలు హరి గోస పడుతున్నాయి, ఎమ్మెల్యే కోరుకంటి చెందరే బాధ్యత తీసుకొని డబ్బులు ఇప్పించడంతో పాటు, బాధితులకు, ఉపాధి అవకాశాలు చూపించాలని , మావోయిస్టు పార్టీ, సింగరేణి కార్మిక సమాఖ్యను, కడుపులో పెట్టి కాపాడుకున్న ప్రజలకు పార్టీ ఎళ్లవేళలా అండగా ఉంటుందనీ భరోసాచ్చారు.