- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా పాలన విజయోత్సవాలకు రాజన్న ఆలయం దూరం
దిశ, వేములవాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా బుధవారం రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో సుదర్శన, గణపతి, నవ గ్రహ చండీ హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహించగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో మాత్రం బుధవారం ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఇక్కడి అధికారులకు సమాచారం అందిందా లేక సమాచారం ఇచ్చినప్పటికీ ఆలయ అధికారులు మరిచిపోయారా అనే విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు ఇదే విషయంపై ఆలయ అధికారులను సంప్రదించగా తమకు సమాచారం అందిందని, పూజలు చేస్తున్నామని తెలిపారు. అయితే పూజల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పేర్కొన్నప్పటికీ పూజల్లో వారు ఎక్కడ కనిపించకపోవడం, పూజలు చేసిన ఫోటోలు బయటకు రాకపోవడంతో అసలు నిజంగా ఆలయంలో పూజలు జరిగాయా లేదా అధికారులు దాటవేసే ప్రయత్నం చేస్తున్నారా అనే అంశాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.