మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం..

by Sumithra |
మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం..
X

దిశ, కోనరావుపేట : మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ యువకుడిని చితకబాది వీరంగం సృష్టించాడు. పూర్తివివరాల్లోకెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణానికి చెందిన పృథ్వీరాజ్ అనే కానిస్టేబుల్ డిచ్ పల్లి బేటాలియన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా శనివారం రాత్రి, మద్యం మత్తులో ఓ యువకున్ని చితకబదిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శనివారం రాత్రి రొండి వెంకటేష్ అనే యువకుడు రెండవ బైపాస్, భవానినగర్ విధి ప్రాంతంలో ఫోన్ మాట్లాడుతూ ఉండగా, అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ పృద్విరాజ్ ఆ యువకున్ని నువ్వు ఇక్కడేందుకు నిల్చున్నావ్, ఎం చేస్తున్నావు అంటూ వాగ్వాదం పెట్టుకొని, అనవసరంగా కొట్టినట్టు ఆ యువకుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఆ యువకున్ని పృధ్వీరాజ్ చితకబాదిన వీడియోలు షోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పట్టణ సీఐ వెంకటేష్ కేసునమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేష్ మాట్లాడుతూ రాత్రి వేళల్లో, అవాంఛనీయ సంఘటనలు కాని, ఎదైన ఇబ్బందులు, ఏమైనా సమస్యలు తలెత్తుతే సంబంధిత పోలీసు శాఖ వారిని సంప్రదించాలని లేదా 100 ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Next Story