- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ ఆసుపత్రిలోకి వర్షపు నీరు..రోగుల అవస్థలు
దిశ, జగిత్యాల టౌన్ : శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఉమెన్స్ వార్డ్ పక్కనే ఉన్న టాయిలెట్స్ పైగల స్లాబ్ నుంచి వర్షపు నీరు లీకై పేషెంట్స్ ఉన్న వార్డ్ లోకి వచ్చి చేరింది. వార్డులో నుంచి వచ్చిన నీరు వరండా లోకి సైతం రావడం తో రోగులు ఇబ్బందులు ఎదురుకున్నారు. టాయిలెట్స్ దగ్గర నుంచి వర్షపు నీరు రావడం కారణంగా వచ్చిన దుర్వాసనతో కొద్దిసేపు రోగులకు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే స్పందించిన ఆసుపత్రి సిబ్బంది వార్డులో నుండి వరండా మీదుగా వర్షపు నీటిని బయటకు తోడేసారు. వర్షానికి నీరు ఏకంగా వార్డులోకి రావడం పట్ల రోగులు అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా వర్షానికి నీరు వస్తుందనే ఇటీవల చేపట్టిన మరమ్మత్తులలో భాగంగా వార్డు పక్కనే ఉన్న టాయిలెట్స్ పైన గల స్లాబ్ కి ప్లాస్టరింగ్ చేసి రిపేర్ చేయడం గమనార్హం.