- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు కన్నీరు తెప్పిస్తున్న వర్షాలు
by S Gopi |
X
దిశ, వీణవంక: గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలో పంటలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. వర్షాలు రైతులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. గురువారం రాత్రి నుండి ఎడతెరపీ లేకుండా కురుస్తున్న వర్షానికి వరి పంట, మొక్క జొన్న దెబ్బతిన్నాయి. ఎన్నో ఆశలతో వ్యవసాయ పెట్టుబడులకు అప్పులు చేసి సాగు చేసిన రైతులకు వర్షాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. రాత్రనక, పగలనక ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిందని సంబర పడేలోపు అనుకోకుండా కురిసిన వర్షానికి మొక్క జొన్న పంట పూర్తిగా నేలకొరిగింది. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Advertisement
- Tags
- rain
Next Story