- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ గాంధీ పర్యటన కొత్త ఉత్తేజం నింపింది.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
దిశ, జగిత్యాల టౌన్ : రాహుల్ గాంధీ జగిత్యాల పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తీసుకువచ్చిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శనివారం ఇందిరా భవన్లో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ రోడ్ షో సక్సెస్ చేయడానికి కృషి చేసిన శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని తెలుగులో అనువాదం చేయడం సంతోషకరమన్నారు.
బీసీ రిజర్వేషన్లు 25 శాతం నుండి 40 శాతానికి పెంచాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన చేపడతామని తెలిపారు. పంటలకు మద్దతు ధర కల్పించడంతో పాటు మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. సమగ్ర కుటుంబ సర్వేతో తెలంగాణ సమాజ స్వరూపం అద్దంపట్టినట్టు కనపడుతుందని అయితే సర్వేఫలితాలు ఎందుకు బహిర్గతం చేయడం లేదో సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాయని గుర్తు చేశారు.