సీఎం కేసీఆర్ ను కలిసిన Putta Madhukar

by Shiva |   ( Updated:2023-08-22 15:13:01.0  )
సీఎం కేసీఆర్ ను కలిసిన Putta Madhukar
X

దిశ, మంథని : పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మంగళవారం సీఎం కేసీఆర్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంథని బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేసిన నేపథ్యంలో మధుకర్ సీఎం కేసీఆర్ ను కలిసి పుష్సగుచ్ఛం అందజేశారు. తనపై నమ్మకంతో మూడోసారి మంథని అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు సీఎం ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎ కేసీఆర్ తనను మరోసారి ప్రత్యేకంగా కలవాలని మధుకర్ కు సూచించారు. మంథనిలో ఎవరెన్ని కుట్రలు చేసినా.. తన విజయం తథ్యమని కేసీఆర్ అన్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ సమస్యలపై పూర్తి సమాచారంతో గురువారం రావాలని సీఎం సూచించారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story