- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
40 ఏళ్లుగా మా భూముల్లో మినీ మేడారం జాతర నిర్వహిస్తున్నాం (వీడియో)
దిశ, వీణవంక: మినీ మేడారంగా పేరుగాంచిన వీణవంక సమ్మక్క-సారలమ్మ జాతరకు ఇటీవలే ఎండోమెంట్ ఆధ్వర్యంలో కమిటీలు వేశారు. ఈ కమిటీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పాడి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, కలెక్టర్ ఆధ్వర్యంలో ఎండోమెంట్ ద్వారా ఏర్పరచిన కమిటీని వ్యతిరేకిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రద్దయిన కమిటీ సభ్యులు పనులు నిర్వహిస్తున్నారని, హైకోర్టు తీర్పును స్థానిక పోలీసులు అమలు చేయాలని రామకృష్ణారెడ్డి వర్గీయులు రోడ్డుపై బైఠాయించి గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పాడి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... మండల ప్రజల కోరిక మేరకు గత 40 ఏళ్లుగా తమ సొంత వ్యవసాయ భూముల్లో సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహిస్తున్నామని, కానీ, ఇటీవల ప్రభుత్వం 22 మందితో కమిటీ ఏర్పరిచిందని, ఈ కమిటీని వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్లగా కమిటీ చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. పోలీసులు, అధికారులు హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని, జాతరను ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా చూడాలని కోరారు.