- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవిత అరెస్ట్ పై సిరిసిల్లలో నిరసన.. దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో అపశృతి
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ధర్నా సందర్భంగా ప్రధానీ మోడీ, ఈడీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో దూసుకుపోతారనే భయంతోనే, దానిని అడ్డుకోవాలనే అరెస్టు చేశారని వారు దుయ్యబట్టారు. పార్టీని బద్నామ్ చేయాలనే ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు అనుకొన్నారని వారు వెల్లడించారు. కేటీఆర్ అరెస్టును చూపించాలని అడిగినప్పట్టికి చూపించకుండా అరెస్ట్ చేశారని, ఇది కేవలం ప్రధాని మోదీ కుట్ర అని వారు ఆరోపించారు. వెంటనే అరెస్ట్ చేసిన కవితను బేషరతుగా విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని వారు హెచ్చరించారు.
దిష్టిబొమ్మ దహనంలో అపశృతి
దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న క్రమంలో అక్కడే ఉన్న ఒక కార్యకర్త ప్యాంటు పై పెట్రోల్ పడి, మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన ఆ కార్యకర్త వెంటనే ప్యాంటును విప్పేశాడు. అప్పటికే మంటలు ఎగిసి పడి, ఆ కార్యకర్తకు స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. వెంటనే అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆ కార్యకర్తను జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.