- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సమస్యలు నడుమ ఇందిరమ్మ కాలనీ..దశాబ్ద కాలం గడిచినా కనీస సౌకర్యాల లేమి
దిశ,శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామంలో 126 ఇందిరమ్మ గృహాలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరు కాగా అందులో కొన్ని సొంత స్థలం కలిగిన వారికి వారి స్థలాల్లోనే కట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతించి గృహ నిర్మాణానికి కావలసిన మొత్తాన్ని చెల్లించింది. భూమిలేని నిరుపేదలకు సొంత స్థలం లేని వ్యక్తులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో మాజీ ఎంపీటీసీ గోపి విజయలక్ష్మి మల్లేశం వద్ద భూమిని కొనుగోలు చేసి మరీ గృహలను నిర్మించి ఇచ్చింది. సర్వే నంబర్ సర్వే నెంబర్ 304 లో రెండు ఎకరాల ఆరు గంటల భూమిని గృహ సముదాయాల కోసం కేటాయించి నిర్మించారు. తర్వాత ప్రభుత్వం మారడంతో ఆనాడు ఏ స్థితిలో నైతే ఇందిరమ్మ కాలనీలో ఉన్న రోడ్లు ఉన్నాయో నేటికీ అదే పరిస్థితిలో ఉన్నాయి. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ సదుపాయాలు లేకపోవడంతో కాలనీ దుర్గంధాన్ని వెదజల్లుతుంది.
దీంతో ఇందిరమ్మ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. పది సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనైనా కాలనీ బాగుపడుతుందని కాలనీవాసులు ఆశించారు. కానీ ఆట పాటల హడావిడి తప్ప అభివృద్ధి ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. ముఖ్యంగా వీధి దీపాలు లేకపోవడం డ్రైనేజీ సదుపాయాలు లేకపోవడంతో ఇండ్లలోని మురుగునీరు రైతుల పట్టా భూములలోకి ప్రవేశించడంతో పక్కన ఉన్న రైతుల పొలాలు పాడవుతున్నాయని దీంతో ఇబ్బంది పడుతున్నట్లు కాలనీ వాసులు తెలిపారు .మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాలనీ వాసుల ఆశలు చిగురిస్తున్నాయి.
ఏ ప్రభుత్వమైతే కాలనీని ఏర్పాటు చేసిందో అదే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో కాలనీలో కనీస సౌకర్యాల ఏర్పాటు జరగవచ్చు అని కాలనీవాసులు చర్చించుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంతా మేమే అని చక్రం తిప్పిన యువకులు , సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాభివృద్ధిని గాలికి వదిలేసారని గ్రామస్తులు వాపోతున్నారు. వారు వారి స్వప్రయోజనాలకు జేజేలు పలికే నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు కానీ గ్రామాన్ని కానీ ఇందిరమ్మ కాలనీలో సౌకర్యాలను విస్మరించడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత ప్రయోజనాలతో తమ స్వార్థం కోసం పనిచేయడంతో కాలనీ లో కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నామని అన్నారు. ప్రస్తుత మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక చొరవ తీసుకుని కాలనీవాసుల కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు.
డ్రైనేజీ సదుపాయాలు లేదు : చెల్లోజు లక్ష్మీనారాయణ
ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేసి దశాబ్ద కాలానికి కంటే ఎక్కువైంది. కానీ డ్రైనేజీ సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు చెల్లోజు లక్ష్మీనారాయణ తెలిపారు
వర్షం వస్తే.. మొత్తం బురదే : సయ్యద్ చాంద్
డ్రైనేజీ సదుపాయాలు లేక కాలనీ లో నేటికీ సీసీ రోడ్లు లేకపోవడంతో వర్షాకాలం వస్తే బురదలో నడవాల్సి వస్తుందని సయ్యద్ చాంద్ తెలిపాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి.