సమస్యల పరిష్కారానికే ప్రజావాణి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

by Aamani |
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
X

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సమస్యల పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాటిని పరిష్కరించాలని అధికారులకు వివరించారు. దరఖాస్తుల పరిష్కారంలో జ్యాపం వద్దని ఆదేశించారు. ఆయా శాఖలకు సంబంధించి 51 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో రమేష్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story