రోడ్డు మధ్యలో గుంత... వాహనదారులకు చింత

by Aamani |
రోడ్డు మధ్యలో గుంత... వాహనదారులకు చింత
X

దిశ,కరీంనగర్ టౌన్ : ప్రమాదాలు జరిగితే హడావుడిగా స్పందిస్తూ నిబంధన గుర్తు చేసుకునే అధికారులు వాటి నివారణకు ముందు మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తారు. ప్రమాదం అని అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోకుండా తమ బాధ్యతలను విస్మరిస్తారు. నగరంలోని పద్మనగర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వెళ్లే బైపాస్ రోడ్డు మీద ప్రజారోగ్య ఇంజనీర్ కార్యాలయం ఎదురుగా పెద్ద గుంత ఏర్పడి ప్రమాదంగా మారింది.

అంతేకాకుండా ఆ గుంతకు అడ్డుగా బారిగేట్ పడేయడంతో రాత్రిలో ప్రయాణించే వాహనదారులకు కనబడకుండా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. బైపాస్ రోడ్డు కావడంతో వాహనాలు స్పీడ్ గా వెళుతుంటాయి. రోడ్డుపై ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం తో గుంత దగ్గరకు వచ్చేవరకు వాహనదారులు గమనించకపోవడం ఒక్కసారిగా వాహన వేగం సైతం కంట్రోల్ కాకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై గుంతను పూడ్చి బారిగెట్ తీసివేస్తే ప్రమాదాలను నివారించవచ్చు.

Advertisement

Next Story