- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏఐసీసీ ప్లీనరీలో జిల్లా నేతలు
దిశ, కరీంనగర్ టౌన్: రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన సోనియా గాంధీ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్నారని పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర రాజధాని రాయపూర్ లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో కరీంనగర్ జిల్లా నుండి ముఖ్య నేతలు హాజరయ్యారు. కాగా, సోనియా గాంధీ రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లుగా చేసిన ప్రకటన పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రజలకు అండగా ఉండడమే కాకుండా కరీంనగర్ వేదికగా ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, వారిని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులమైన మేమంతా ఈ దేశ సమైక్యత కోసం, దేశ అభివృద్ధి కోసం పాటుపడతామని మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బలుమూరి వెంకట్, పీసీసీ మెంబర్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, పలువురు నేతలతో కలిసి ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీలు మధు యాష్కీ గౌడ్, సిరిసిల్ల రాజయ్య, పిసిసి ప్రోటోకాల్ కన్వీనర్ హర్కాల వేణుగోపాల్ తదితరులు పేర్కొన్నారు.