కొండగట్టు అంజన్నకు పోచంపల్లి చేనేత వస్త్రాలు..

by Vinod kumar |
కొండగట్టు అంజన్నకు పోచంపల్లి చేనేత వస్త్రాలు..
X

దిశ, మల్యాల: కొండగట్టు ఆంజనేయ స్వామికి పెద్ద జయంతి సందర్భంగా ఆలయ అధికారులు పోచంపల్లి చేనేత వస్త్రాలు సమర్పించనున్నారు. శుక్రవారం ఉదయం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి జరుగు బ్రహ్మోత్సవాల చరిత్రలో మొదటిసారి చేనేత పోచంపల్లి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ శ్రీ గణపతి దేవాలయం ట్రస్టీ, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యదర్శి ఎస్ఎస్ జయరాజు ఆధ్వర్యంలో చేనేత మగ్గం పనిని కార్యనిర్వాహణాధికారి డిప్యూటీ కమిషనర్ వెంకటేష్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు.

ఈ కార్యక్రమంలో పోచంపల్లి చేనేత కళాకారులు గుర్రం శీను, గుర్రం సంతోష్ కుమార్, జానయ్య, కరుణాకర్, గణేష్ పాల్గొని చేనేత వస్త్రాలను నిష్టగా నేయడం జరిగింది. మే 12న శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల మొదటి రోజు స్థానిక శాసనసభ్యులు రవిశంకర్ తో కలిసి ఊరేగింపుగా కార్యనిర్వాహణా అదికారి డిప్యూటీ కమిషనర్ వెంకటేష్ సమక్షంలో స్వామివారికి సమర్పించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed