ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండిపోయే దుస్థితి : మేడిపల్లి సత్యం ఫైర్​

by Sridhar Babu |
ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండిపోయే దుస్థితి : మేడిపల్లి సత్యం ఫైర్​
X

దిశ, రామడుగు : పాలకుల నిర్లక్ష్యంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే దుస్థితి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ మేడిపల్లి సత్యం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంగాధర మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టి రోడ్డును దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నారాయణపూర్ రిజర్వాయర్​కు వెంటనే నీటిని విడుదల చేయాలని, నారాయణపూర్ రిజర్వాయర్ కింద యాసంగి వరి పంటను రక్షించేందుకు అధికార యంత్రాంగం తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం వెంటనే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నారాయణపూర్ రిజర్వాయర్​ నీటిని విడుదల చేసి, నారాయణపూర్ ,చర్లపల్లి, మంగపేట, ఇస్తారుపల్లి గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు మేడిపల్లి సత్యం ను అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, గంగాధర చొప్పదండి, కొడిమ్యాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మనోహర్, శ్రీనివాస్ రెడ్డి ,నారాయణ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుచ్చయ్య, మహేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, రమేష్ ఎంపీటీసీ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story