- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంకా అనుమానాలు ఉన్నాయి... అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
దిశ, జగిత్యాల ప్రతినిధి : ధర్మపురి ఎలక్షన్ పిటిషన్ సంబంధించి స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేసిన క్రమంలో అందులో ఉంచిన సుమారు 20కి పైగా ట్రంక్ బాక్సులకు అసలు తాళాలు లేవని పిటిషనర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాకు తెలిపారు. కేవలం 4 ట్రంక్ బాక్సులకు మాత్రమే తాళం వేసి ఉందని తాళాలు ఉన్న నాలుగు బాక్సులను పగలగొట్టి ఓపెన్ చేశారని ఆయన అన్నారు. నాలుగున్నర సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నుండి అధికారుల వస్తే తప్ప తనకు న్యాయం జరగదని అన్నారు.
సీఎం కేసీఆర్ గాని, మంత్రి కొప్పుల ఈశ్వర్ గాని ఎందుకు స్పందించడం లేదు అని ఆయన ప్రశ్నించారు. ఈసీఐ అధికారి ఆధ్వర్యంలో ఓపెన్ చేసిన స్ట్రాంగ్ రూమ్ లోని ఈవీఎం, ట్రంక్ బాక్స్ లలో ఉన్న పత్రాలను సీరియల్ గా సెట్ చేసి ప్రొసీజర్ పూర్తి కావడానికి ఇంకొక 3 నుండి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉందని లక్ష్మణ్ కుమార్ తెలిపారు. తనకు న్యాయస్థానం పై పూర్తిగా నమ్మకం ఉందని చివరకు న్యాయమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.