- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామాల అభివృద్ధే టీఆర్ఎస్ ముఖ్య ధ్యేయం: పేరాల గోపాల్‌రావు
దిశ, సైదాపూర్: గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని కరీంనగర్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పేరాల గోపాల్రావు అన్నారు. శుక్రవారం సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూ.10 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను.. ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కాయిత రాములు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మూడు వందల పథకాలను అమలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మండల పరిషత్ నిధులతో లస్మన్నపల్లి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెన్నంపల్లి సింగిల్ విండో చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ మ్యాకల మల్లారెడ్డి, ఆరేపల్లి సర్పంచ్ పాపయ్య, పెర్కపల్లి సర్పంచి కొమురయ్య, గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామస్తులు పాల్గొన్నారు.