Peddapalli Collector : పక్కా ప్రణాళికతో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలి

by Aamani |
Peddapalli Collector : పక్కా ప్రణాళికతో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం కావాలి
X

దిశ,పెద్దపల్లి : జిల్లాలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024-25 కు సంబంధించిన వరి పంట పక్కా ప్రణాళికతో కొనుగోలు చేసేందుకు అధికారులు సన్నద్దం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. ధాన్యం కొనుగోలు సన్నద్ధత పై అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వానాకాలం ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూపొందించుకున్న ప్రణాళిక, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, తదితర అంశాలను అధికారులు వివరించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో 4 లక్షల 6 వేల పైగా మెట్రిక్ టన్నుల పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని, వీటి కొనుగోలుకు 311 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏ మాసం ఎంత ధాన్యం దిగుబడి కొనుగోలు కేంద్రాలకు వస్తుందో మండలాల వారీగా ముందస్తుగానే ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత సీజన్ లో గ్రేడ్ ఏ రకం ధాన్యానికి 2320 , సాధారణ రకం ధాన్యానికి 2300 మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.

Next Story