- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విమర్శలు కాదు.. భాధ్యతను గుర్తు చేస్తున్నాం : డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
దిశ, పెగడపల్లి : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తూ. .రైతుల సమస్యలు తెలుసుకుంటూ.. ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తున్నామని విమర్శలు చేయడం లేదని డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని లింగాపూర్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. యాసంగి పంట మొదలు నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతులు అధిక పెట్టుబడి పెట్టారని కానీ ఆశించిన దిగుబడి రాకపోగా అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిందన్నారు. దానికి తోడు తాలు, తప్ప అంటూ క్వింటాల్ కి 5 కిలోల తరుగు తీస్తూ రైతులను ఇంకా ముంచుతున్నారని ఇప్పటికైనా మంత్రి కొప్పుల ఈశ్వర్ రైతులు పడుతున్న బాధల మీద స్పందించి మిల్లర్లతో మాట్లాడి మిల్లర్ల పెత్తనాన్ని అడ్డుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు రాయితీల మీద వ్యవసాయ పరికరాలు అందించడమే కాకుండా హమాలీ ఛార్జీలు కూడా చెల్లించామని పంట నష్టం జరిగితే బోనస్ కూడా చెల్లించామని గుర్తు చేశారు. ఇదంతా చెప్పడం విమర్శించడం కాదని మీ బాధ్యతను మీకు గుర్తు చేయడమే అని అన్నారు. ఇప్పటికైనా మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించి రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా మిల్లర్లను కట్టడి చేస్తూ ఎలాంటి షరతులు లేకుండా తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వెంట పార్టీ మండలాధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, స్థానిక సర్పంచ్ ఈరెల్లి శంకర్, ఎంపీటీసీ పూసల శోభ తిరుపతి, సింగిల్ విండో డైరెక్టర్ తోట మల్లేశం, మాజీ సర్పంచ్ కిషన్ రావు, నాయకులు మంద రమేష్, గజ్జి తిరుపతి, శ్రీరామ్ అంజయ్య, బత్తిని చంద్రశేఖర్, రైతులు, తదితరులు ఉన్నారు.