'తొండి ప్రభుత్వం పోవాలి.. బండి ప్రభుత్వం రావాలి'

by S Gopi |   ( Updated:2022-12-15 11:43:50.0  )
తొండి ప్రభుత్వం పోవాలి.. బండి ప్రభుత్వం రావాలి
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: తొండి ప్రభుత్వం పోవాలి.. బండి ప్రభుత్వం రావాలి అని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. కరీంనగర్ లో ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భైంసాలో బండి సంజయ్ సభను కుట్రలతో ఒకరోజు వాయిదా పడేలా చేశారన్నారు. కేసీఆర్ సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా... భైంసా సభను విజయవంతం చేసి, బీఆర్ఎస్ కు వణుకు పుట్టించామన్నారు. బీజేపీలోనే బండి సంజయ్ అంత నడిచిన చరిత్ర ఎవరికీ లేదన్నారు. స్వయంగా ఈ విషయాన్ని ప్రధాని మోదీనే కొనియాడారని అన్నారు. కరీంనగర్ గడ్డను నాది అనుకునే కేసీఆర్ కు... ఇది బీజేపీ గడ్డ అని నిరూపించిన ఘనత బండి సంజయ్ దే అని ఎంపీ బాపురావు అన్నారు.

Also Read...

యువత అడుగులు కమలం వైపు.. బీజేపీలో భారీ చేరికలు

Advertisement

Next Story