- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిస్కో ఆడించిన పాపం ఊరికే పోదు: MP బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, జగిత్యాల ప్రతినిధి: పీఎఫ్ఐ లాంటి సంఘ విద్రోహశక్తులకు బీఆర్ఎస్ పార్టీ నిధులు ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. పీఎఫ్ఐకి జెండాలు ఇతరత్రా సామాగ్రి సమకూర్చిందెవరో తెలియాలని డిమాండ్ చేశారు. జగిత్యాలలో పీఎఫ్ఐ పేరుతో ఉన్న సంఘవిద్రోశక్తులను పోలీసులు వెంటనే కాల్చివేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ నుండి ఇంటిలిజెన్స్ అధికారులు తెలంగాణ వస్తే తప్ప.. ఇక్కడి ప్రభుత్వం స్పందించలేదని దుయ్యబట్టారు. మక్కాకి వెళ్లే వారికి వెసులుబాటు ఉంటుంది, రంజాన్ అంటే వెసులుబాటు ఉంటుంది, కానీ హిందూ దీక్ష పరులకు ఉండదా అంటూ ప్రశ్నించారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న ఉద్యోగులకు విధుల సమయాల్లో వెసులుబాటు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
పేదలైన దీక్ష పరులకు అయ్యప్పను దర్శించుకునేందుకు మేము ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. ముస్లింలకు తాను వ్యతిరేకం కాదని, అల్లాకి వ్యతిరేకంగా ఏనాడూ మాట్లాడలేదన్నారు. ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ వీఆరెస్ అయిపోతుందని వ్యాఖ్యానించారు. వేములవాడ, ధర్మపురిల అభివృద్ధి కోసం వందల కోట్ల ఇస్తాన్నన సీఎం మళ్ళీ ఆ ఊసే తీయడం లేదన్నారు. కొండగట్టుకు ఒక్కసారి కూడా సీఎం కేసీఆర్ వెళ్లలేదని, కొండగట్టు ప్రమాదం జరిగితే సామూహిక అంత్యక్రియలు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. అలాంటి దయనీయ పరిస్థితిలోనూ సీఎం కనికరించలేదంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చన్నారు.
అలాంటి ఆయన వంద కోట్ల ఇస్తామంటే నమ్ముతామా అంటూ మండిపడ్డారు. బతుకమ్మ పేరుతో కవిత డిస్కో ఆడించిందని, ఆ పాపం ఊరికే పోతుందా అన్నారు. సాక్షిగా కవితను పిలిస్తే సాక్ష్యం చెప్పాలి కానీ.. ఆమె ఇంటి కింద ఆ హడావుడి ఎందుకు చేశారో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మోటార్లకు మీటర్లు పెట్టి నరేంద్ర మోడీ నిందపై వేయాలని చూస్తున్నారని.. దానిని తాము చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. జగిత్యాల మాతా శిశు కేంద్రంలో పదుల సంఖ్యలో చనిపోయిన ఘటనల గురించి కేసీఆర్ మాట్లాడలేదని, జగిత్యాల రోడ్ల విస్తరణ గురించి కూడా సీఎం పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి రావాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు కూడా మాతో కలిసి రావాలన్నారు. కేసీఆర్ గడిల పాలన పోవాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు.
READ MORE
ప్రజలారా.. దోపిడీ, అణిచివేతని బద్దలు కొడదాం : మావోయిస్టు కార్యదర్శి ఆజాద్ లేఖ