- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MP Arvind : కేటీఆర్ తన్నులు తినడం ఖాయం
దిశ, జగిత్యాల ప్రతినిధి : కేటీఆర్ పాదయాత్ర చేస్తే తన్నులు తినడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచనల కామెంట్స్ చేశారు. శనివారం జగిత్యాలలో బీజేపీ నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేసీఆర్, కేటీఆర్ పదేళ్లలో పూర్తిగా నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలు కాదు కదా రాష్ట్రమంతా పాకులాడినా కేసీఆర్ శ్రేణులకు కుక్క కూడా ఓటెయ్యదని అన్నారు. పదేళ్లపాటు రాష్ట్రంలో కళ్లు నెత్తినెక్కిన పాలనను ప్రజలు చూశారని, ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని అన్నారు. ఇప్పటికే దరిద్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరింత దరిద్రంగా తయారు చేస్తుందని విమర్శించారు.
ఇచ్చిన హామీలు అమలు చేయలేకనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను జాప్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టినా బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. బీసీ కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన కుల గణనను సక్రమంగా వేగంగా పూర్తి చేసి ఎన్నికలకు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పాలనలో కనీసం కొనుగోలు కేంద్రాలకు కూడా దిక్కులేవని, కళ్యాణ లక్ష్మితో పాటు ఇస్తామన్న తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై ఇప్పటికే గ్రామాల్లో రైతులు, మహిళలు వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి అనుకున్న దానికన్నా ముందే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నేచురల్ డెత్ అయిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ తప్పా మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. సభ్యత్వ నమోదు పెద్ద ఎత్తున చేపట్టి నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టేందుకు ఎంతో దూరం లేదని అన్నారు.