MP Arvind ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

by Nagaya |   ( Updated:2022-09-02 11:58:12.0  )
MP Arvind ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
X

దిశ, కోరుట్ల : శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ మతానికి చెందిన వ్యక్తి జ్యువెలరీ షాప్ పెడుతున్నాడని, దాని వల్ల స్థానిక స్వర్ణకారుల ఉపాధి దెబ్బతింటుందనే అంశం పై శుక్రవారం కోరుట్లలో స్వర్ణకారులు సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి హాజరవుతున్న ఎంపీ ధర్మపురి అరవింద్‌ను మెట్‌పల్లి డీఎస్పీ రవీందర్, కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు పోలీస్ సిబ్బందితో కలిసి మెట్ పల్లి శివారులోని గండి హనుమాన్ దేవాలయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి ఆర్ముర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Next Story